7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి... వైరల్ అవుతున్న వీడియో!

  • ఇండొనేషియా యువతి సుసంతి అరుదైన రికార్డు
  • చైనాలో జరిగిన క్లైంబింగ్ పోటీలు
  • 'స్పైడర్ విమెన్'గా ప్రశంసలు 
సుసంతి రహయా... ఇండొనేషియాకు చెందిన యువతి. ఈ యువతి చేసే సాహసాలు చూస్తే ఔరా అనాల్సిందే. స్పైడర్ కన్నా వేగంగా గోడలను సునాయాసంగా ఎక్కేయగలదు. 15 అడుగుల ఎత్తును 7 సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే ఎక్కేసింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 6.995 సెకన్లలో ఆమె గోడను ఎక్కింది. చేతి వేలికి గాయం కాగా, ఆ నొప్పిని భరిస్తూనే, సుసంతి గోడను ఎక్కేయగా, ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది.

చైనాలోని క్సియామెన్ లో ఐఎస్ఎఫ్సీ క్లైంబింగ్ ప్రపంచకప్ పోటీలను నిర్వహించగా, సుసంతి ఈ ఫీట్ ను సాధించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 60 లక్షల మందికి పైగానే వీక్షించారు. వారంతా ఈమెను స్పైడర్ విమెన్ గా అభివర్ణిస్తూ, పొగడ్తలు కురిపిస్తున్నారు. సుసంతి గోడనెక్కుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Indonesia
Susanti
Climb
Wall
China
Viral Videos

More Telugu News